MLAs purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో కీలక వాదనలు
ABN , First Publish Date - 2022-12-15T16:44:17+05:30 IST
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchasing Case)పై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి.
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchasing Case)పై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. సీఎం కేసీఆర్ (CM KCR) రిలీజ్ చేసిన వీడియోలపై పిటిషనర్ల అభ్యంతరం తెలిపారు. ఫామ్హౌస్ (Farmhouse) ఎపిసోడ్ వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటపెట్టిన ఫుటేజ్ను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. హై ప్రొఫైల్ కేసులో దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు ఎలా బయటకు వెళ్లాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటిషనర్లు అన్నారు. సెక్షన్ 17(b) ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వకేట్ జనరల్ తెలిపారు. 2003లో ఏసీబీ పరిధిని నియమిస్తూ జీఓ జారీ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. 2003 నుంచి నమోదైన పీసీ యాక్ట్ కేసులన్నీ.. ఏసీబీనే విచారించాలని జీవో ఉందని పిటిషనర్ గుర్తుచేశారు. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని కోర్టుకు పిటిషనర్లు విన్నవించారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. శుక్రవారం తుది వాదనలు వింటామని హైకోర్టు (High Court) పేర్కొంది.