ఆయిల్‌ఫామ్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాలు
ABN , First Publish Date - 2022-11-27T00:38:54+05:30 IST
ఆయిల్‌ఫామ్ సాగుకు మన నేలలు అనుకూలమని ఆయిల్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
సత్తుపల్లి, నవంబరు 26: ఆయిల్‌ఫామ్ సాగుకు మన నేలలు అనుకూలమని ఆయిల్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బయ్యన్నగూడెం, రేగళ్లపాడు నర్సరీలలో మొక్కలు నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కల్లూరుగూడెంలో నూతనంగా నిర్మించబోయే ఫామాయిల్ ఫ్యాక్టరీ స్థలాన్ని సందర్శించారు. మొక్కలను ఎలా పెంచుతున్నారు, సాగులో ఎటువంటి పద్దతలు పాటించాలి, ఎటువంటి ఎరువులను వాడాలి, ఆయిల్‌ఫామ్ దిగుబడి సంవత్సరంలో ఏ నెలలో అధికంగా వస్తుందనే విషయాన్ని రైతులకు వివరించారు. ఆయన వెంట అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల మేనేజర్లు కల్యాణ్, బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఉన్నారు.