కమనీయం.. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2022-03-15T05:51:38+05:30 IST
కమనీయం.. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
కొమ్మాల ఆలయంలో ప్రత్యేక పూజలు
గీసుగొండ, మార్చి 14: కొమ్మాలలోని లక్ష్మీనర సింహస్వామివారి కల్యాణోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామి, లీలాదేవి, భూదేవిలను పట్టువస్త్రాలతో అందంగా ముస్తాబు చేసి ఆలయ గుట్టపై నుంచి పల్లకిలో దిగువన ఉన్న కల్యాణ మండపానికి వేదమంత్రో చ్ఛరణ మధ్య తీసుకువచ్చారు. ఉత్సవమూర్తులు ఆసీనులైన పల్లకిని మోయడానికి భక్తులు పోటీ పడ్డారు. కల్యాణ మండపంపై స్వామివారి కల్యా ణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి, జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, టీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు కొండా రాధ, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసా చార్యులు, అర్చకులు రామాచార్యులు, ఈవో శేషగిరి, సర్పంచ్‌లు నాగేశ్వర్‌రావు, రజిత, కవిత, ఎంపీటీసీ లు గోపాల్, హనుమ పాల్గొన్నారు.
కొమ్మాల జాతరకు రాజకీయ ప్రభ బండ్లను తీసుకురావొద్దు
దుగ్గొండి : గీసుగొండ మండలం కొమ్మాలలోని లక్ష్మీనర్సింహస్వామి జాతరలో రాజకీయ ప్రభ బండ్లు నిషేధమని సీఐ సూర్యప్రసాద్ తెలిపారు. దుగ్గొండి పొలీ్‌సస్టేషన్‌లో సోమవారం పలు రాజకీయ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో సీఐ మాట్లాడారు. జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సై వంగాల నవీన్‌కుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.