Medak csi church: మెదక్ సీఎస్‌ఐ చర్చ్ బిషప్‌ సాలమన్‌పై కత్తి దాడి యత్నం..

ABN , First Publish Date - 2022-11-13T20:10:18+05:30 IST

మెదక్ సీఎస్ఐ చర్చ్ (Medak csi church) బిషప్ రెవరెండ్ సాలమన్ రాజ్‌పై (Solomon Raj) కత్తి దాడి యత్నం జరిగింది.

Medak csi church: మెదక్ సీఎస్‌ఐ చర్చ్ బిషప్‌ సాలమన్‌పై కత్తి దాడి యత్నం..

మెదక్: మెదక్ సీఎస్ఐ చర్చ్ (Medak csi church) బిషప్ రెవరెండ్ సాలమన్ రాజ్‌పై (Solomon Raj) కత్తి దాడి యత్నం జరిగింది. 10 మంది సంఘ సభ్యులు ఈ దాడికి యత్నించారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బిషప్ బంగ్లాలో బిషప్ రెవరెండ్ సాలమన్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ నన్ను చంపడానికి మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రతిపక్ష సంఘ సభ్యులు ప్రయత్నించారు. తప్పించుకున్నాను. క్రిస్టియన్ సంప్రదాయాన్ని దెబ్బతిసే విధంగా ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మెదక్ సీఎస్ఐ చర్చ్ స్థానిక ఎన్నికల నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

Updated Date - 2022-11-13T20:20:59+05:30 IST