కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు
ABN , First Publish Date - 2022-10-23T16:54:27+05:30 IST
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాసమస్యలను కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ పేదల అకౌంట్లలో కాదు.. ఒక్కరి అకౌంట్‌లోనే రూ.18 వేల కోట్లు వేశారని విమర్శించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాసమస్యలను కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ పేదల అకౌంట్లలో కాదు.. ఒక్కరి అకౌంట్‌లోనే రూ.18 వేల కోట్లు వేశారని విమర్శించారు. స్వార్ధ రాజకీయాల కోసమే మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని తప్పుబట్టారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నించారు. బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.