Home » KT Rama Rao
చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణకు అంటగట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏడాది కిందట కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని ఆగం చేసిందని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డిది అబద్ధాల పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కానుకలకు కోత పెట్టిన రేవంత్ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారంటూ గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ అధిష్ఠానంపైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ గురువారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం దోచుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అయ్యప్ప సొసైటీలో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, కమీషన్లు, సెటిల్మెంట్ల దందా
తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. సోమవారం ఉదయం జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అయ్యారు.
స్థానిక సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో సమస్యలపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు.
కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థల కారణంగా కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ దివంగత చైర్మన్ సాయిచంద్(Saichand) కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(Former Ministers KTR, Harish Rao) అన్నారు.