Srinivas Goud: సీఎం కేసీఆర్ 8 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించడం ఓ వరం..
ABN , First Publish Date - 2022-11-15T15:21:29+05:30 IST
గత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో తీవ్ర వివక్షకు గురైందని, వైద్య రంగం అధ్వానంగా ఉండేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్ నగర్: గత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో తీవ్ర వివక్షకు గురైందని, వైద్య రంగం అధ్వానంగా ఉండేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ సీఎం కేసీఆర్ ఎనిమిది మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను ప్రారంభించడం ఓ వరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటగా మహబూబ్‌నగర్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ హబ్‌గా మహబూబ్‌నగర్ జిల్లాను తీర్చి దిద్దుతామన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామన్న హామీని నిలబెట్టు కోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
కాగా రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో వర్చువల్‌గా సీఎం క్లాసులను ప్రారంభించారు.