Home » Mahabubnagar
రాష్ట్రంలో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నందున.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి విక్రయించకుండా చూసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
కన్నవారికి ఎప్పటికప్పుడు అబద్ధం చెబుతూ వచ్చాడు కానీ, వారికి నిజం తెలిసే సమయం దగ్గరపడుతుండటంతో కంగారుపడిపోయాడు. నిజం తెలిసిపోతే తన పరిస్థితి ఏమిటనే భయంతో తీవ్ర ఆందోళన చెందాడు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల భూకంపం సంభవించిన విషయాన్ని మరువక ముందే తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.
మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండగ సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టట్లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు.
రైతులు బీఆర్ఎస్ పన్నిన ఉచ్చులో పడొద్దని, ఆ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి కేసుల పాలు కావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భూసేకరణ చేయకుండా పరిశ్రమల ఏర్పాటు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగ విజయవంతమైంది. తొలి రెండ్రోజులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
కాంగ్రెస్ పార్టీతోనే రైతురాజ్యం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ చేయని మేలు, పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేసి చూపిందని ఆయన చెప్పారు.
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు.
ఈనెల 28 నుంచి మహబూబ్‌నగర్ పట్టణంలో మూడ్రోజుల పాటు రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.