ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ABN , First Publish Date - 2022-01-01T17:30:42+05:30 IST

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత ఉంటదని మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌ అన్నారు.

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ఎంపీ మాలోత్‌ కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

మరిపెడ రూరల్‌(చిన్నగూడూరు), డిసెంబరు 31: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత ఉంటదని మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌ అన్నారు. శుక్రవారం మరిపెడ మండలం బీచ్‌రాజ్‌పల్లిలోని అభయ ఆంజనేయస్వామి ఆలయ ప్రథ మ వార్షికోత్సవ వేడుకలను వేదపండితులు కొడకండ్ల సుధాకర్‌గౌతమ్‌చార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మ న్‌ ఆలయ నిర్మాణ దాత గుడిపూడి నవీన్‌రావు-మంజుల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్‌  అరుణరాంబాబు, జడ్పీటీసీ తేజవత్‌ శారదరవీందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ సింధూరరవినాయక్‌, క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌.అచ్యుత్‌రావు, ఓడీ సీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంక న్న, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T17:30:42+05:30 IST