Jagadish Reddy: తెలంగాణకు రావలసిన డబ్బులు ఆపి.. ఇబ్బంది పెడుతున్న కేంద్రం..
ABN , First Publish Date - 2022-12-01T15:59:40+05:30 IST
నల్గొండ జిల్లా: ఉపాధి హామీ పథకం తెలంగాణలో బాగా జరుగుతుందనే అక్కసుతో కేంద్రం ఆ పథకాన్ని ఆపే కుట్ర చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు.
నల్గొండ జిల్లా: ఉపాధి హామీ పథకం తెలంగాణలో బాగా జరుగుతోందనే అక్కసుతో కేంద్రం ఆ పథకాన్ని ఆపే కుట్ర చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. గురువారం మునుగోడులో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రం నుంచి ఒక టీమ్‌లో ముగ్గురు అధికారులు వచ్చి చూసేవారని, కానీ ఈసారి 18 బృందాలు వచ్చి చూడడం విశేషమని అన్నారు. అయితే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వకుండా నేరుగా గ్రామాలకు వెళ్లి చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) వచ్చాక.. గ్రామ పంచాయతీలు ఇతర రాష్ట్రాలలోని పట్టణాలతో పోటీ పడుతున్నాయని, గ్రామాలకు వలసలు తిరిగి వస్తున్నాయన్నారు. కేంద్రం తెలంగాణకు రావలసిన డబ్బులు ఆపి ఇబ్బంది పెడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakararao) మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని చెప్పారు. మిషన్ భగీరథ (Mission Bhagiratha) కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాకు దాదాపు రూ. 6వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దూరదృష్టితో వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్లతో గ్రామ పంచాయతీల ఆదాయం ఘణనీయంగా పెరిగిందన్నారు. కేంద్రం నుంచి రూ. 703 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 150 కోట్లు రైతు కల్లాలకు ఖర్చు చేశామని అన్నీ నిధులు ఆపిందన్నారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆదేశమని, అన్ని చోట్లా రోడ్లు వేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.