వట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న వరి పొలాల్లో పశువుల మేతలు.. కొన్నిచోట్ల ఇప్పటికే కరువు ఛాయలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు సాధించాలని ప్రభుత్వ విఫ్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్లు, నియామకాల విషయంలో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎ్సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్సయాద వ్ ఆరోపించారు. గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం చి లక్షల ఎకరాలకు సాగునీరు అం దించి ఎంతో మంది రైతులను ఆదుకుంటే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరాన్ని పండబెట్టి రైతుల భూములను ఎండబెట్టారని విమర్శించారు.
ఏకీకృత జిల్లా పాఠశాలల విద్యా సమాచారం (యూడై్స)లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదు చేసిన వివరాలపై నేటి నుంచి థర్డ్ పార్టీ సర్వే ప్రారంభం కానుంది.
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) రానున్న విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు తక్షణ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లలో ఈ ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నారు.
చౌటుప్ప ల్ ప్రాంతంలో నెలకొన్న సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి జలాలను రప్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
మదర్డెయిరీలో నెలకొన్న అప్పులతో పాడి రైతులకు బిల్లుల చెల్లింపు కష్టతరంగా మారింది. నెలల తరబడి పాల బిల్లులకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో పశు పోషణకు ఇబ్బందులు పడుతున్నారు.
మాజీ మంత్రి, సీనియర్నేత జానారెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి.
మంత్రి పదవి తనకు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
హనుమాన్ విజయయాత్ర శనివారం భువనగిరి లో వైభవంగా సాగింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో కాషాయ జెండాలు ప్రదర్శిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకీ జై నినాదాలతో డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హనుమాన్ భక్తులు హోరెత్తించారు.