వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయే

ABN , First Publish Date - 2022-11-10T00:34:12+05:30 IST

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసి భావిశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు విద్యాశాఖ ప్రతి యేడాది నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు సమయం వచ్చేసింది.

వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయే

నిజామాబాద్‌అర్బన్‌, నవంబరు 9: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసి భావిశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు విద్యాశాఖ ప్రతి యేడాది నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు సమయం వచ్చేసింది. వచ్చే నెల మొదటి వారంలో జిల్లాస్థాయి ప్రదర్శనను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. విద్యార్థులు వారి ఆలోచనలకు పదునుపెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలను రూపొందించాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ ద్వారానే వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించగా ఈ యేడాది ప్రత్యక్ష ంగా ప్రదర్శనను నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థులను జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. 2019-20 విద్యా సంవత్సరంలో చివరిసారిగా ప్రత్యక్షంగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా 2020-21 విద్యాసంవత్సరంలో కరోనా వ్యాప్తి వల్ల ప్రదర్శన నిర్వహించలేదు.

ప్రతి పాఠశాల నుంచి ప్రదర్శన

జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి తప్పనిసరిగా ఒక ప్రాజెక్టు ఉండేలా విద్యాశాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించాల్సి ఉం టుంది. 6,7 తరగతుల విద్యార్థులను జూనియర్‌ గ్రూప్‌గా, 8, 9, 10 తరగతుల విద్యార్థులను సీనియర్‌ గ్రూప్‌లుగా విభజించి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్‌, ఎయిడెడ్‌, ఆదర్శ, గిరిజన, ఆశ్రమ, కేజీబీవీ, గురుకుల, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

డిసెంబరు మొదటి వారంలో జిల్లా స్థాయి ప్రదర్శన

ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో 50వ జవహార్‌లాల్‌ నెహ్రూ జాతీయ సైన్స్‌, గణిత, పర్యావరణ ప్రదర్శనను జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శన డిసెంబరు 3వ వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాస్థాయి ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనలను జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. గతంలో జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఆ తర్వాత జాతీయస్థాయికి ప్రాజెక్టులు ఎంపికైన ఘటనలు ఉన్నాయి. ఈ యేడాది కూడా ఉత్తమ ప్రదర్శనలను ప్రదర్శించేందుకు విద్యాశాఖ జిల్లా విద్యార్థులను సిద్ధం చేస్తంది.

దరఖాస్తు విధానం ఇలా..

టెక్నాలజి, టాయ్స్‌ అనే ప్రధాన అంశంతో పాటు 7 ఉప అంశాలతో విద్యార్థులు తమ ప్రదర్శనలను ప్రదర్శించాల్సి ఉంటుంది. విద్యార్థులు వారు చదువుతున్న పాఠశాలలో గైడ్‌ టీచర్ల సలహాలతో తయారు చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించాల్సి ఉంటుంది. టెక్నాలజి, టాయ్స్‌ (సాంకేతిక బొమ్మలు) అనే ప్రధాన అంశంతో పాటు ఉప అంశాలు 1.స్నేహపూర్వక పర్యావరణం, 2. ఆరోగ్యం, పరిశుభ్రత, 3. రవాణాలో వినూత్న ఆలోచనలు, 4. పర్యావరణానికి సంబంధించిన అంశాలు, 5. మనకోసం గణితం, 6. సమాచార, కమ్యూనికేషన్‌ టెక్నాలజీలో ప్రగతి, 7. ప్రస్తుత ఆవిష్కరణలతో చారిత్రక అభివృద్ధి అనే అంశాలలో ప్రాజెక్టులు రూపొందించాలి.

ఆసక్తి చూపని ప్రైవేట్‌ విద్యాసంస్థలు

విద్యావైజ్ఞానిక ప్రదర్శనతో పాటు ప్రతి సంవత్సరం నిర్వహించే ఇన్స్‌పైర్‌ కార్యక్రమంలో ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రైవేట్‌ విద్యాసంస్థలు అంతగా ఆసక్తిని కనబర్చడంలేదు. గత రెండు, మూడు యేళ్లుగా నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల్లో ఆశించినస్థాయిలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు తమ ప్రాజెక్టులను ప్రదర్శించలేదు. ఈ విద్యాసంవత్సరం అయి నా ప్రైవేట్‌ విద్యాసంస్థలు తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తాయోలేదో చూడాల్సి ఉంది.

ఎంపికైతే విద్యార్థులకు మంచి భవిష్యత్తు

ఫ దుర్గాప్రసాద్‌, డీఈవో

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనతో పాటురాష్ట్రస్థాయి, జాతీయస్థాయి ప్రదర్శనలలో మంచి ప్రాజెక్టులను ప్రదర్శిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ శాస్త్రవేత్తల సహకారంతో మంచి ప్రాజెక్టులలో భాగస్వాములు కావచ్చు. జాతీయస్థాయిలో ప్రతిభకనబర్చిన వారికి ఢిల్లీలో రాష్ట్రపతి, మానవవనరులశాఖమంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, సత్కారాలు అందుకునే అవ కాశం ఉంటుంది. జిల్లాస్థాయి ప్రదర్శనను విజయవం తం చేసేలా ప్రధానోపాధ్యాయులు శ్రద్ధను కనబర్చాలి.

Updated Date - 2022-11-10T00:34:13+05:30 IST