Home » Telangana » Nizamabad
ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా...
చాలా కాలం తర్వాత నిజామాబాద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వస్తున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలు తిహార్ జైలులో ఉన్న అనంతరం మొదటి సారి జిల్లాకు వస్తున్నారు. డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘనస్వా గతం పలుకుతారు. బై పాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్, ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
Telangana: కామారెడ్డిలో ఇద్దరు పోలీసులు, ఓ యువకుడి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురి బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Telangana: రైతు భరోసాపై కీలక అప్డేట్ వచ్చేసింది. రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారనే దానిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టతనిచ్చారు. అలాగే వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బీటీ రోడ్ వేస్తామని.. మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని వెల్లడించారు.
ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కు ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.
ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.
బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు.
దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల నక్షత్రం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల నక్షత్రం వస్తుందని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.