తొర్తి బీపీఎం సస్పెన్షన్!
ABN , First Publish Date - 2022-10-29T00:50:36+05:30 IST
మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన బీపీఎం సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన ఖాతాదారుల నగదును తన సొంతానికి వాడుకోవడంపై ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన ‘పక్కదారి పడుతున్న సుకన్య యోజన పథకం’ అన్న కథనానికి జిల్లా త పాలా శాఖ అధికారులు స్పందించారు.
బీపీఎంపై శాఖా పరమైన చర్యలకు ఆదేశం
తిమ్మాపూర్ బీపీఎంకు అదనపు బాధ్యతలుల
ఏర్గట్ల, అక్టోబరు 28: మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన బీపీఎం సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన ఖాతాదారుల నగదును తన సొంతానికి వాడుకోవడంపై ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన ‘పక్కదారి పడుతున్న సుకన్య యోజన పథకం’ అన్న కథనానికి జిల్లా త పాలా శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్మూర్ తపాలా శాఖ అధికారి రాజా నర్సాగౌడ్ సిబ్బందితో తొర్తి గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. బీపీఎం వద్ద ఉన్న బాధితుల ఖాతాలతో పాటు కొంత నగ దు, తపాలా శాఖకు సబంధించిన సామగ్రిని స్వా ధీనం చేసుకున్నారు. బీపీఎంను సస్పెండ్ చేస్తున్న ట్లు ప్రకటించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామా నికి చెందిన బీపీఎంకు అదనపు బాధ్యతలు అప్ప జెప్పారు. కాగా, ఎలాగైనా తాము చెల్లించిన రూపాయలు తమకు రికవరీ చేయించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
కాళ్లబేరానికి బీపీఎం
ఖాతాదారుల నగదును సొంతానికి వాడుకున్న విషయం ‘ఆంధ్రజ్యోతి’లో రావడంతో బీపీఎం ఖాతాదారుల వద్దకు వెళ్లి కాళ్లబేరానికి వచ్చినట్లు సమాచారం. కొందరి ఇంటికి వెళ్లి వాడుకున్న నగదును చెల్లించినట్లు పలువురు తెలిపారు. మరికొందరిని అధికారుల విచారణకు వెళ్లవద్దని వేడుకున్నట్లు చెప్పారు.
ఉపాధిహామీ వేతనం చెల్లింపులోనూ అవినీతి
ఉపాధిహామీ పథకంలో కూడా బీపీఎం అవినీతికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. కూలీలకు వచ్చే డబ్బు లను సరిగ్గా చెల్లించలేదన్నారు. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని స్థానిక మహిళలతో పాటు గ్రామస్థులు తెలిపారు
శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం..
అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఆర్మూర్ సబ్ డివిజన్
అవకతవకలకు పాల్పడిన తొర్తి బీపీఎంను సస్పెండ్ చేశాం. బీపీఎం దగ్గర ఉన్న ఖాతాలను స్వాధీనం చేసుకుని ఖాతాదారులను పిలిపించి ఎవరు ఎంత నగదు చెల్లించారో వివరాలు సేకరించాము. తిమ్మాపూర్ బీపీఎంకు అదనపు బాధ్యతలు అప్ప జెప్పడం జరిగింది. పది రోజుల్లో విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకొని నగదు రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తాం.