TS NEWS: నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ
ABN , First Publish Date - 2022-12-03T21:37:00+05:30 IST
భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు రగ్గులను పంపిణీ చేశారు.
పాల్వంచ: భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు రగ్గులను పంపిణీ చేశారు. శనివారం పాల్వంచ పట్టణంలోని పెద్దమ్మ తల్లి గుడి, సీ కాలనీ సెంటర్, బస్టాండ్, పలు ఫుట్ పాత్‌లపై నిత్యం రాత్రిపూట నిద్రిస్తున్న వారికి బ్లాంకెట్స్ , రొట్టెలు, పండ్లు, వాటర్ బాటిల్లను వైద్యులు డాక్టర్ సోమరాజు దొర అందజేచేశారు. నేతాజీ యువజన సంఘం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఏటా చలితో అల్లాడుతున్న అనాధలు, యాచకులు, అభాగ్యులు, మతిస్థిమితం లేనివాళ్ళు, నిరాశ్రయులకు రగ్గులను పంపిణీ చేస్తోంది.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి పాల్వంచ ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు దొర ముఖ్యఅతిథిగా హాజరై వారి చేతుల మీదుగా రగ్గులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ తోటి మనుషుల పట్ల ప్రేమ జాలి కరుణ కలిగి ఉండాలన్నారు. నేతాజీ యువజన సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని డాక్టర్ సోమరాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె అహ్మద్, సంఘం సభ్యులు షేక్ సలీం, షేక్ రజియా, సయ్యద్ అక్బర్, ఎం.డి.అబ్దుల్ రజాక్, జె. స్టాలిన్, ఎస్డి అంజద్, జె. బిక్షం, ముగిది శ్రీరామ్, ఎండి బాబర్, దివిటి శ్రీను, ఓం ప్రకాష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.