చర్చిల ముస్తాబు

ABN , First Publish Date - 2022-12-24T23:05:22+05:30 IST

ఎక్కడ చూసినా క్రిస్మస్‌ సందడి నెలకొంది. నేడు(ఆదివారం) జరుగనున్న క్రిస్మస్‌ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా చర్చిలు ముస్తాబయ్యాయి.

చర్చిల ముస్తాబు
కేశంపేట మండలం పాటిగడ్డలోని లూర్దుమాత చర్చి

జిల్లాలో పండుగ సందడి

చర్చిలకు రంగురంగుల విద్యుత్‌ దీపాలంకరణ

ఇబ్రహీంపట్నం/యాచారం/మొయినాబాద్‌/కేశంపేట, డిసెంబరు 24: ఎక్కడ చూసినా క్రిస్మస్‌ సందడి నెలకొంది. నేడు(ఆదివారం) జరుగనున్న క్రిస్మస్‌ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా చర్చిలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్‌ లైట్లతో కాంతులీణుతున్నాయి. పండుగ షాపింగ్‌లతో దుకాణాలు, బేకిరీల్లో సందడి నెలకొంది. చర్చిల వద్ద క్రిస్మస్‌ ట్రీలు, స్టార్‌లు ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులు తమ ఇళ్లను అలంకరించుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని చర్చిలను పండుగ కోసం అలంకరించారు. నేటి ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కేక్‌ కటింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాల కోసం క్రైస్తవులు, ఫాదర్లు, పాస్టర్లు పూర్తి ఏర్పాట్లు చేశారు. యాచారం మండలంలోని సెయింట్‌ గ్రెగోరియస్‌ బాలాగ్రామ్‌ చర్చిని సుందరంగా తీర్చిదిద్దారు. చిన్నతూండ్ల, చౌదర్‌పల్లి, నజ్దిక్‌సింగారం, నందివనపర్తి, గున్గల్‌ గ్రామాల్లోనూ చర్చిలను ముస్తాబు చేశారు. కేశంపేట మండలం పాటిగడ్డలోని లూర్దుమాత చర్చిని విద్యుత్‌ దీపాలతో డెకరేట్‌ చేశారు.

మంత్రి, కలెక్టర్‌ శుభాకాంక్షలు

రంగారెడ్డి అర్బన్‌: క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. యేసుక్రీస్తు జననాన్ని పురస్కరించుకొని జరపుకుంటున్న ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఇంటింటా ఆనంద కాంతులు వెల్లివిరియాలని కోరారు.

Updated Date - 2022-12-24T23:05:23+05:30 IST