ప్రమాదకరంగా కరెంటు వైర్లు!
ABN , First Publish Date - 2022-12-11T23:42:45+05:30 IST
ఆదమరిచారో ప్రాణాలు హరీ! యాచారం మండలం నానక్‌నగర్‌లో ఎల్టీ విద్యుత్ లైన్ చేతికందే ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి.
ఆదమరిచారో ప్రాణాలు హరీ! యాచారం మండలం నానక్‌నగర్‌లో ఎల్టీ విద్యుత్ లైన్ చేతికందే ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. లైన్‌ను సరిచేయాల్సిన ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పట్టించుకోక గ్రామస్తులు, రైతులకు ప్రాణాంకంగా పరిణమించింది. గడ్డిమోపు ఎత్తుకొని వెళ్లినా కరెంట్ వైర్లు తాకే పరిస్థితి ఉంది. కిందికైన వైర్లను లాగి అవససమున్నచోట్ల స్తంభాలు పాతాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ పెద్దయ్య శనివారం తెలిపారు. ఇటీవల వైర్లకు హార్వెస్టర్‌కు తగిలిందని, త్రుటిలో ముప్పు తప్పిందని వాపోయారు
- యాచారం, డిసెంబర్ 11