Lakshman: తెలంగాణలో సీఎం కేసీఆర్ పట్ల ప్రజలు విసిగిపోయారు..

ABN , First Publish Date - 2022-09-15T19:42:24+05:30 IST

వికారాబాద్ (Vikarabad): జిల్లాలో బీజేపీ భరోసా బైక్ ర్యాలీ (BJP Bharosa Bike Rally) నిర్వహించింది.

Lakshman: తెలంగాణలో సీఎం కేసీఆర్ పట్ల ప్రజలు విసిగిపోయారు..

వికారాబాద్ (Vikarabad): జిల్లాలో బీజేపీ భరోసా బైక్ ర్యాలీ (BJP Bharosa Bike Rally) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు లక్ష్మణ్ (Lakshman) హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ చెపట్టిన ‘మీ సమస్యలపై నా పోరాటం’ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) నిరంకుశత్వంపై ప్రజలు, ఉద్యోగులు విసిగిపోయారన్నారు. జేపీ నడ్డా (JP Nadda), అమిత్ షా (Amit Shah) పిలుపు మేరకు ఇవాళ బీజేపీ ర్యాలీ నిర్వాహిస్తోందన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసిన ల్యాండ్, లిక్కర్, ఇసుక మాఫీ ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ (PM Modi) పాలనపై నమ్మకంతో ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress) పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, ముడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో రూపాయికి కిలో బియ్యంలో కేంద్రం 30 రూపాయలు ఇస్తోందన్నారు. దేశంలో బీజేపీ హయాంలోనే రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. తెలంగాణలో ఈ నెల 17న తెలంగాణ విమోచన దినం ప్రభుత్వం జరపకపోవడం సిగ్గుచేటన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పొరడిన చాకల్లి ఐలమ్మ, కొమరం బీమ్‌ల చరిత్రను ప్రజలకు తెలియ చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాని కూకటి వేళ్లతో పీకి వేయడానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని లక్ష్మణ్ పిలుపు ఇచ్చారు.


మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Visweswar Reddy)మాట్లాడుతూ.. తెలంగాణ  రాష్ట్రాన్ని నాశనం చేసింది.. ఆంధ్రోలు కాదని కేసీఆర్ అని అన్నారు. రైతులకు సబ్సిడీ, రుణ మాఫీలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభ్యుతం మోసం చేసిందని విమర్శించారు. పక్క రాష్ట్రాల రైతులకు ఖర్చులు చేసి ప్రగతి భవన్‌లో చర్చలు చేస్తారని విమర్శించారు. తెలంగాణ రైతులతో మాట్లాడడానికి సీఎం కేసీఆర్‌కు సమయం లేదా అని ప్రశ్నించారు. వికారాబాద్ మెడికల్ కళాశాలకు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-15T19:42:24+05:30 IST