TS News: ట్రాఫిక్ పోలీసులపై కౌన్సిలర్ చాపరాజు దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-12-24T11:28:55+05:30 IST
ట్రాఫిక్ పోలీసులపై కౌన్సిలర్ చాపరాజు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
మేడ్చల్: ట్రాఫిక్ పోలీసులపై కౌన్సిలర్ చాపరాజు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీనంటూ హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ట్రాఫిక్ ఎస్సై ఫోన్లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ పోలీసులను ఎంపీపీ భర్త రవి, బంధువు శ్రీనివాస్ గౌడ్ బెదిరించారు. ఈ క్రమంలో ఎస్ఐ ఫోన్ లాక్కున్న ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.