మంత్రులకు నాయకుల దసరా శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-10-09T04:54:13+05:30 IST

మంత్రులకు నాయకుల దసరా శుభాకాంక్షలు

మంత్రులకు నాయకుల దసరా శుభాకాంక్షలు
కేటీఆర్‌కు తిరుపతి ప్రసాదం అందజేస్తున్న శుభప్రద్‌ పటేల్‌

ఘట్‌కేసర్‌/మోమిన్‌పేట్‌/కీసర/ధారూరు/వికారాబాద్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మంత్రి కేటీఆర్‌ను రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌ శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కలిసి శమీపత్రం అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీఆర్‌కు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు. వికారాబాద్‌ జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌ కూడా కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కేటీఆర్‌ను రాష్ట్ర గౌడసంఘం ప్రతినిధులు కలసి దసరా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో కలిసినట్లు గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్‌ బాలగోని వెంకటేష్‌ గౌడ్‌ తెలిపారు. కాగా, కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ నాయకులంతా మునుగోడు ఉపఎన్నికలో నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించినట్లు వెంకటే్‌షగౌడ్‌ తెలిపారు. పలువురు గౌడ సంఘం ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు.

అదేవిధంగా మంత్రి మల్లారెడ్డిని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి దసరా పండుగ పురష్కరించుకొని శాలువాతో సత్కరించారు. నగరంలోని మంత్రి నివాసానికి వెళ్లిన చైర్మన్‌ దసరా శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధి గురించి మంత్రికి వివరించినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నారపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు అబ్బవతిని నర్సింహ పాల్గొన్నారు. అలాగే మల్లారెడ్డిని కీసరగుట్ట ఆలయ చైర్మన్‌ తటాకం ఉమాపతిశర్మ, కీసర ఉపసర్పంచ్‌ తటాకం లక్ష్మణ్‌శర్మ  మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లారెడ్డిని వారు శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

  • రేవంత్‌రెడ్డిని కలిసిన మండలాధ్యక్షుడు

కాంగ్రెస్‌ పార్టీ ధారూరు మండలాధ్యక్షుడు పి.రఘువీరారెడ్డి శుక్రవారం రాత్రి  కొడంగల్‌లో  పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని  కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించినట్లు రఘువీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.


Updated Date - 2022-10-09T04:54:13+05:30 IST