పోరాడితేనే హక్కుల సాధన

ABN , First Publish Date - 2022-12-21T00:02:01+05:30 IST

పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

పోరాడితేనే హక్కుల సాధన
సమావేశంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

కీసర రూరల్‌, డిసెంబరు 20: పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ తిరుమల గార్డెన్‌లో ఉ మ్మడి రాంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ప్రశిక్షణ్‌ శిబిరాన్ని నిర్వహించారు. ఈటల మాట్లాడుతూ.. సకల జనుల సమ్మెతో, అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అ య్యిందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వివిధ పథకాల పేర ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. భిన్న తెగలు, వివిధ భాషలకు చెందిన ప్రజలు నివసిస్తున్న దేశం భారతదేశం అన్నారు. ఇలాంటి వైవిధ్యం మరే దేశంలోనూ లేదన్నా రు. మన పద్ధతులు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమన్నారు. మానవ సమాజ సుసంపన్నానికి ఓబీసీల పాత్ర కీలకమైనప్పటికీ.. వారి పట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవే ధ్యేయంగా జీవిస్తున్న ఓబీసీ కులా లను సామెతల రూపేన కూడా చులకన చేస్తున్నారన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానిగా ఎదగటం గర్వకారణమన్నారు. జనాభాలో 50శాతం ఉన్న ఓబీసీలు రాజ్య పాలన చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఓబీసీ మోర్చా నాయకులు దివాకర్‌, మహేష్‌, లక్ష్మీనారాయణ, రాకే్‌షగౌడ్‌, యాదయ్య, రామోజీ, సదానందం, శ్రీకాంత్‌గౌడ్‌, రవి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

==============

Updated Date - 2022-12-21T00:02:03+05:30 IST