జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా సత్తు వెంకటరమణారెడ్డి

ABN , First Publish Date - 2022-12-02T00:00:53+05:30 IST

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా సత్తు వెంకటరమణారెడ్డి

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 1: రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతోపాటు మరో ఐదుగురిని సభ్యులుగా నియమించారు. వీరిలో ఫారుఖ్‌నగర్‌ మండలానికి చెందిన నక్కల వెంకటే్‌షగౌడ్‌, సరూర్‌నగర్‌ మీర్‌పేట్‌కు చెందిన పంతంగి మాధవి, ఆమనగల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కమతం రాధమ్మ, మొయినాబాద్‌ ఎంపీపీ గున్‌గుర్తి నక్షత్రం, శంషాబాద్‌ ఎంపీపీ దిద్యాల జయమ్మలను సభ్యులుగా నియమించారు. కాగా రమణారెడ్డి నియామకంతో క్రమశిక్షణ, విధేయతలకు పట్టం కట్టినట్లయిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా.. కార్యక్రమాల నిర్వహణలో రమణారెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను పుణికిపుచ్చుకున్న ఆయన ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2009లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం 2015లో ఎమ్మెల్యే మంచిరెడ్డితోపాటు ఆయన టీఆర్‌ఎ్‌సలో చేరారు. 2006లో తులేకలాన్‌ ఎంపీటీసీగా ఎన్నికై జిల్లా ఎంపీటీసీల ఫోరం చైర్మన్‌గా పనిచేశారు. 2016-18 మధ్య ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకుగాను సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.

Updated Date - 2022-12-02T00:00:54+05:30 IST