TS News: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అడ్డుకున్న విద్యార్థులు
ABN , First Publish Date - 2022-11-28T16:15:15+05:30 IST
వికారాబాద్ జిల్లా: శ్రీఅనంతపద్మనాభస్వామి కళాశాల విద్యార్థులు (Students) ఆందోళన (Protest) చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వికారాబాద్ జిల్లా: శ్రీఅనంతపద్మనాభస్వామి కళాశాల విద్యార్థులు (Students) ఆందోళన (Protest) చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కార్ నుంచి రావల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను గురిచేస్తున్నారని వాపోయారు. కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో ఎస్కార్టు వాహ
నంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (MLA Pilot Rohit Reddy)ని విద్యార్థులు అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కరించేంతవరకు కదలనివ్వమన్నారు. ఎమ్మెల్యే, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే.. మంత్రి సబిత ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy)కి ఫోన్ చేసి.. విద్యార్థులతో మాట్లాడించారు. మంత్రితో మాట్లాడిన తర్వాత కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళతామని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సమాధానం చెప్పిన తర్వాతే వెళ్లాలన్నారు. తాము ఈ సెమ్‌కు ఫీజులు కట్టమని విద్యార్థులు స్పష్టం చేశారు.