జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-07T23:34:34+05:30 IST

జాబ్‌మేళాను గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ అన్నారు.

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

కీసర, డిసెంబరు 7: జాబ్‌మేళాను గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఈజీఎమ్‌ఎమ్‌ అధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాయంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈసందర్భంగా జాబ్‌మేళాలో మొత్తం 92 మంది యువతీయువకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా జియోలో 6, వరుణ్‌ మోటార్స్‌లో 15, మెడ్‌ప్లస్‌ ఫార్మసీలో 18, రిలయన్స్‌ ట్రెండ్స్‌లో 12, ఐసీఐసీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌లో 10 మంది యువతీయువకులను నిర్వాహకులు ఉద్యోగ కల్పన నిమిత్తం ఎంపిక చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:34:35+05:30 IST