గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-10-23T23:08:06+05:30 IST
తంగళ్ళపల్లి శివారులో ఆదివారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.
కొందుర్గు, అక్టోబరు 23: తంగళ్ళపల్లి శివారులో ఆదివారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. గుర్తు తెలియని మహిళ వయస్సు సుమారు 35సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటుందన్నారు. మృతురాలు నైటీ, గ్రీన్ జాకెట్ ధరించి ఉందని తెలిపారు. ఆమె ఈనెల 21న షాద్‌నగర్ నుంచి కొందుర్గుకు ఆర్టీసీ బస్సులో వచ్చినట్లు బస్ టికెట్ ఉంది. బ్యాగులో ఒక చీర, జాకెట్ ఉన్నాయి. ఈ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఎక్కడో హత్యచేసి, ఆదివారం తెల్లవారుజామున తంగళ్లపల్లి శివారులోని వాగువద్ద, చించోడ్ వెళ్లే రోడ్డుపక్కన ఉన్న చెట్లపొదల్లో రెండు ప్లాస్టిక్ సంచులు, తాళ్లతో కట్టి పడేసి వెళ్లారని ఎస్‌ఐ తెలిపారు. ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్తున్న రైతులు చూసి వీఆర్‌ఏకు విషయాన్ని తెలపగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కార్, రూరల్ సీఐ సత్యనారాయణ, క్లూస్ టీం పరిశీలించింది. జాగిలాలు మృతదేహం వద్ద నుంచి గ్రామంలోకి వెళ్లి ఆగిపోయాయి. వీఆర్‌ఏ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.