పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-17T23:13:29+05:30 IST

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విద్యార్థుల తల్లితండ్రులు ఉపాధ్యాయులను కోరారు.

పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి
షాబాద్‌: విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ఎంఈవో

కేశంపేట/షాబాద్‌/కందుకూరు, డిసెంబరు 17: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విద్యార్థుల తల్లితండ్రులు ఉపాధ్యాయులను కోరారు. పాఠశాలలో శనివారం ఎస్‌ఎంసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాలికల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు లేవని, వాచ్‌మెన్‌, స్వీపర్‌, స్కావేంజర్‌లు లేకపోవడంతో పాఠశాల అపరిశుభ్రతంగా మారిందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపాటలు, నృత్యాలతో విద్యార్థులు అలరించారు. అదేవిధంగా బాలసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎం రసూల్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నాజియా బేగం, ఉపాధ్యాయులు కవిత, రేడ్యాలాల్‌ పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలోని పోత్‌గల్‌ గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో హెచ్‌ఎం శ్రీనివాస్‌ అధ్యక్షతన శనివారం తల్లిదండ్రులతో సమావేశమై డిజిటల్‌ తరగతులపై అవగాహన కల్పించారు. మండల విద్యాధికారి శంకర్‌రాథోడ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు.అనంతరం యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ ప్రదానం చేసిన ప్రొజెక్టర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్‌ మెంబర్‌ అయూబ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ షబ్బీర్‌, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. సర్పంచ్‌ యాలాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల సర్పంచులు, పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్లు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T23:13:30+05:30 IST