భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-11-02T00:06:43+05:30 IST
: పట్టణానికి ముఖద్వారంగా వెలసిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
షాద్‌నగర్‌అర్బన్, నవంబరు 1: పట్టణానికి ముఖద్వారంగా వెలసిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గర్భగుడి ఆవరణలో ఆలయ పూజారి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించి, పల్లకీసేవ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు భక్తులకు అన్నదానం చేశారు.