రాహుల్ యాత్రపై రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు ఇవే
ABN , First Publish Date - 2022-10-26T17:49:52+05:30 IST
ఈనెల 30న షాద్నగర్కు కాంగ్రెస్ నేత రాహుల్ యాత్ర చేరుకోనుందని టీపీసీపీ ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఈనెల 30న షాద్నగర్కు కాంగ్రెస్ నేత రాహుల్ యాత్ర చేరుకోనుందని టీపీసీపీ ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు. నవంబర్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటలకు మునుగోడులో మహిళా గర్జన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు మహిళా గర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు ఉదయం మక్తల్లో రాహుల్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈనెల 27 నుంచి నవంబర్ 7 వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.