లాభాల బాటలో ఆర్టీసీ
ABN , First Publish Date - 2022-11-10T01:03:04+05:30 IST
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభా ల బాటలో పయనిస్తోందని, ఉద్యోగులు ఇంకా కష్టపడితే సంస్థ బాగుంటుందని ఆర్టీసీఈడీ పురుషోత్తం అన్నారు. బుధవారం ఆ యన నల్లగొండ బస్టాండ్‌ను తనిఖీచేశారు. బస్టాండ్‌లోని స్టాళ్ల లో విక్రయిస్తున్న వస్తువులను పరిశీలించారు. ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు.
త్వరలో కొత్త బస్సులు
ఈడీ పురుషోత్తం
నల్లగొండ అర్బన్, నవంబరు 9: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభా ల బాటలో పయనిస్తోందని, ఉద్యోగులు ఇంకా కష్టపడితే సంస్థ బాగుంటుందని ఆర్టీసీఈడీ పురుషోత్తం అన్నారు. బుధవారం ఆ యన నల్లగొండ బస్టాండ్‌ను తనిఖీచేశారు. బస్టాండ్‌లోని స్టాళ్ల లో విక్రయిస్తున్న వస్తువులను పరిశీలించారు. ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. ప్రయాణికులను పలకరించి బస్టాండ్‌లో సౌకర్యాలను బస్సుల రాకపోకలను అడిగి తెలుసుకున్నారు. గ్యారేజ్ లో బస్సుల రిపేర్,స్పేర్ పార్ట్స్‌ను పరిశీలించి అనంతరం ఆర్‌ఎం, డీఎంలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలోనే కొత్త బస్సులు వస్తాయన్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలుకూడా సంస్థని ఆదరించాలన్నారు. కరోనా తర్వా త ఆర్టీసీ ఇప్పుడే కోలుకుంటుందని, అందరూ సమష్ఠి కృషి చేయాలన్నారు. కొత్తబస్సులు వస్తే ప్రయాణికులకు రవాణా సౌకర్యం మె రుగవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన ఉద్యోగుల ను సన్మానించారు. డిపోలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. ఆయనవెంట ఆర్‌ఎం బి.వరప్రసాద్, డీవీఎం చెన్నకేశవులు, డీఎం రాంమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.