ఆ పాఠశాలలో అన్నీ అవే..

ABN , First Publish Date - 2022-06-13T05:44:00+05:30 IST

ఆ పాఠశాలలో అన్నీ అవే..

ఆ పాఠశాలలో అన్నీ అవే..
చెరువుముందు తండా ప్రాథమిక పాఠశాల వరండాలో బీర్‌ సీసాలు

పర్వతగిరి, జూన్‌ 12: ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నపిల్లలు తిరుగాడే వరండాలో మందుబాబులు తాగి పడేసిన బీరు బాటిళ్లు, చికెన్‌ వ్యర్థాలు కనిపించాయి. సోమవారం నుంచి పాఠశాల పునఃప్రారంభం కానుండగా, స్కూల్‌ ఆవరణలో  బీరు సీసాలను చూసి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే... వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామ శివారులోని చెరువుముందు తండాలో ప్రాథమికోన్నత పాఠశాలలో వేసవి సెలవుల్లో సాయంత్రం కాగానే కొందరు దర్జాగా సిట్టింగులు వేస్తూ మద్యం తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆదివారం కూడా పాఠశాల వరండాలో తాగి వదిలేసిన బీరుసీసాలు, చికెన్‌ వ్యర్థాలు, ఖాళీ ప్లేట్లు స్థానికులకు కనిపించాయి. ఇంతవరకు ఉపాధ్యాయులు గానీ, విద్యాశాఖ అధికారులు గానీ పాఠశాలను సందర్శించకపోవడంతోనే మందుబాబులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారని తండావాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2022-06-13T05:44:00+05:30 IST