BRS: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు

ABN , First Publish Date - 2022-12-14T18:36:33+05:30 IST

మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీకి మద్దతు కనిపిస్తోంది.

BRS: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు

ఆదిలాబాద్‌: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీకి మద్దతు కనిపిస్తోంది. బుధవారం ఢిల్లీ (Delhi)లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించిన సందర్భంగా.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా పటోదా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఉత్తంరావు, బిక్కు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) స్థాపించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ (Telangana)లోని ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్ర(కె) గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రధానమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని అన్నారు. కేసీఆర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ‘బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సర్కారు’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Updated Date - 2022-12-14T18:38:04+05:30 IST