Home » BRS
కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టుపెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే, తాకట్టు పెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందరూ ఒక గదిలో కూర్చుని అసలు అమ్ముకున్నారో, కుదవపెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎ్‌సతో కలిసి పనిచేసే ఆలోచన సీపీఐకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, బీఆర్ఎస్ తప్పుడు విధానాల వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు.
Harish Rao: రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని హరీష్‌రావు కోరారు.
మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని అన్నారు. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ కొనియాడారు.
BRS Warangal Meeting: హనుమకొండలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ పోలీసులకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
హరీశ్‌రావు, కంచగచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం చేసిందని ఆరోపించారు. చెట్లు నరికినందుకు వన్యప్రాణులు చనిపోవడం, అటవీ శాఖ నిర్లక్ష్యం వంటి అంశాలు తీసుకు వచ్చి, రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
HCU Land Issue: తెలంగాణలో హెచ్‌సీయూ భూముల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు ఫేక్ వీడియోలతో ప్రచారం చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు బీఆర్ఎస్ నేతలను విచారణ చేస్తున్నారు.
Harish Rao: రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, రూ. 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్‌రావు విమర్శించారు.
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.