తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
ABN , First Publish Date - 2022-12-10T20:33:16+05:30 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలను ప్రభుత్వ వెల్లడించింది. పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలీస్‌శాఖను మరింత పటిష్టం చేయాలని, వివిధ కేటగిరీలలో 3,966 పోస్టుల భర్తీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ కట్టడిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. కొత్త పీఎస్‌లు, సర్కిల్‌లు, డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, రూ.635 కోట్ల నిధులను కేటాయిస్తూ టీఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు, ఆర్అండ్‌బీలో పలు విభాగాల్లో 472 అదనపు పోస్టులు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. ప్రకృతి విపత్తుల్లో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు డీఈఈ నుంచి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు తీసుకున్నారు. ఆర్అండ్‌బీకి ఏడాదికి రూ.129 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.