తెలంగాణ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2022-11-29T17:04:46+05:30 IST

తెలంగాణను (Telangana) అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ  ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్: తెలంగాణను (Telangana) అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. ఫామ్‌హౌస్‌లో పండుకునే కేసీఆర్ (KCR) బీఆర్‌ఎస్‌ (BRS) తో బీజేపీ (BJP)ని, మోదీ (Modi)ని అడ్డుకుంటారంట అని ఎద్దేవా చేశారు. ఎన్ని బీఆర్‌ఎస్‌లు, ఎంఐఎం (MIM)లు కలిసి వచ్చినా మోదీని అడ్డుకోలేరన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అవడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ (TRS) నేతలు అవినీతి సొమ్ము కక్కించి పేదలకు ఇస్తామన్నారు. గ్రానైడ్‌, ఇసుక క్వారీలు కల్వకుంట్ల కుటుంబ చేతుల్లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేయడం, ప్రజాధనాన్ని దోపిడీ చేయడం జరుగుతోందన్నారు. బీజేపీ, ఈటలను ఓడించేందుకే దళితబంధు తెచ్చారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-11-29T17:04:48+05:30 IST