కేసీఆర్ మీడియాను కొనుగోలు చేశారు: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-12-14T16:52:15+05:30 IST
మోదీ, కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఢిల్లీ: మోదీ, కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో మీడియాను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. కేసీఆర్కు లిక్కర్ అంటే చాలా ఇష్టమన్నారు. తెలంగాణలో లిక్కర్ ఆదాయం రూ.36 వేల కోట్లకు తీసుకెళ్లారన్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వైఖరి యాంటీ టీఆర్ఎస్, యాంటీ కేసీఆర్ అన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన కేసీఆర్ డీఎన్ఏ మారదన్నారు. పార్టీ పేరు మారినంత మాత్రాన కేసీఆర్ మారినట్లు కాదని చెప్పారు. నోటీసులు లేకుండా పోలీసులు కాంగ్రెస్ వార్రూమ్పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లోను కాంగ్రెస్ వార్రూమ్పై దాడి అంశం చర్చకు తెస్తామన్నారు.