Home » Congress
ప్రజా పాలనలో ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సమస్యలపై సర్కారును నిలదీస్తే నిర్బంధిస్తారా? అని ధ్వజమెత్తారు.
గురివింద చందంగా బీఆర్ఎస్ పార్టీ తీరు ఉందని.. ఆ పార్టీ విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ‘ముడా’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఓటమితో ఖంగు తిన్న తరుణంలోనే బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.
వాయనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం చేశారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని మరీ ప్రమాణం చేశారు. ప్రియాంక గాంధీని పలువురు ఎంపీలు అభినందించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విరక్తి చెందారని, అదే సమయంలో గత బీఆర్ఎస్ పాలనలోని చీకటి రోజులను వారు మరచిపోలేదని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో పీఎంకే డిస్టిలేషన్కు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు.
టెక్నికల్ కారణాలతో ఆగి పోయిన రుణమాఫీని ప్రభుత్వం త్వరలోనే వేస్తుందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చెన్నారెడ్డి తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కూడా ఖాతాల్లో పడుతుందని అన్నారు. ప్రతిపక్షాల మాటలను రైతులు నమ్మొద్దని చెన్నారెడ్డి చెప్పారు.
బెదిరింపులకు పాల్పడుతున్న కేటీఆర్పై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. కేటీఆర్ లాక్కున్న భూములు ప్రభుత్వ భూములుగా గుర్తించడం అధికారులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. సిరిసిల్లా భూ ఆక్రమణలపై సీఐడీ విచారణ జరపాలని సీఎంఓకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
కొడంగల్ పారిశ్రామికవాడ కోసం తీసుకునే భూమిలో 11 శాతం మాత్రమే గిరిజనులదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. ఆ భూమికి మెరుగైన పరిహారంతో పాటుగా ఉద్యోగాలూ ఇస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
సంభాల్ కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందూ-ముస్లిం సమాజాల మధ్య చీలికలు, వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలిగించదన్నారు.