Kishan Reddy : పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్
ABN , First Publish Date - 2022-10-30T21:03:01+05:30 IST
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
TS News: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రచార ప్రసంగంపై కిషన్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది టీఆరెస్సేనని ఆరోపించారు. జీఎస్టీపై సీఎం అవగాహనారాహిత్యంగా మాట్లాడుతున్నారని, తెలంగాణలో ఫ్లోరైడ్ నిర్మూలన కోసం రాష్ట్రం కంటే కేంద్రమే ఎక్కువగా ఖర్చు చేసిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఎక్కువ రేటుకు పెట్రోలను విక్రయిస్తున్నది తెలంగాణలోనేనని పేర్కొన్నారు.
‘‘పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్. సీపీఐలో గెలిచ్చిన ఏకైక ఎమ్మెల్యేను టీఆర్ఎస్ చేర్చుకున్నారు. అలాంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుంది. టీఆర్ఎస్‌కు ఎలా మద్దతు ఇస్తున్నారో కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ ఎందుకు బంధించారో బయట పెట్టాలి. రూ. 400 కోట్ల అంశాన్ని FIRలో ఎందుకు పొందుపర్చలేదు. టర్నోవర్ 40 లక్షలపైన ఉంటేనే చేనేతపై జీఎస్‌టీ పడుతుంది. జీఎస్‌టీని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం కాదు. జీఎస్‌టీ కౌన్సిల్. 5శాతం జీఎస్‌టీలో 2.5 శాతం రాష్ట్రానికి వస్తుంది. ఫ్లోరైడ్ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికన్నా కేంద్రం ఖర్చు చేసిందే ఎక్కువ. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం రూ. 800 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. మునుగోడుకు నీళ్లు ఇస్తాం అంటున్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు. కేసీఆర్ ఎన్ని చెప్పినా గెలిచేది బీజేపీనే. కేసీఆర్ దొంగ దారిలో జీవోలు తీసుకొచ్చి సీబీఐని రావద్దంటున్నారు. ఈ దేశంలో పెట్రోల్‌పై అత్యధిక పన్ను వేసి.. అత్యధిక రేటుకు అమ్మేది ఈ తెలంగాణలొనే.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే బిచ్చగత్తెను చేశారు.. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టదుగాక పెట్టదు. ’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
==========================
Kishan Reddy, BJP, TRS, KCR