Simhayajulu: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో అరెస్టైన సింహయాజులు బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..
ABN , First Publish Date - 2022-10-28T21:05:05+05:30 IST
తెలంగాణా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారాలని ప్రలోభపెట్టేందుకు యత్నించారన్న ఆరోపణలపై సింహయాజులు అరెస్టు కావడం మండల వ్యాప్తంగా..
చిన్నమండెం (అన్నమయ్య జిల్లా): తెలంగాణా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారాలని ప్రలోభపెట్టేందుకు యత్నించారన్న ఆరోపణలపై సింహయాజులు అరెస్టు కావడం మండల వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మండలంలోని పడమటికోన గ్రామం రామనాధపురానికి చెందిన సింహయాజులు (అశోక్)ను అక్కడి పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారన్న నేపధ్యంలో గురువారం ఉదయం నుంచే ఈ విషయమై స్థానికంగా పలువురు చర్చించుకున్నారు. అశోక్ గతంలో చిన్నమండెం మండల కేంద్రంలో, రాయచోటిలోనూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేశారు. దాదాపు ఐదారు సంవత్సరాల కిందట అతను తిరుపతికి వెళ్లిపోయారు. ఇటీవలే రామనాధపురంలో తాను నివాసం ఉంటున్న ఇంట్లో శ్రీమంతరాజుపీఠాన్ని నెలకొల్పారు. పత్రికల్లో, టీవీలలో ఆయన అరెస్టు విషయం తెలియగానే పలువురు గురువారం ఉదయం ఆయన ఇంటికి వద్దకు వచ్చి ఈ విషయమై చర్చించుకున్నారు.