డ్రైఫ్రూట్ లడ్డూ
ABN , First Publish Date - 2022-02-23T17:59:04+05:30 IST
బాదం- 30 గ్రాములు, పిస్తా- 20 గ్రాములు, డేట్స్- 50 గ్రాములు, బెల్లం పొడి- 50 గ్రాములు, గోధుమ పిండి- 30 గ్రాములు, శెనగ పిండి- 30 గ్రాములు
కావలసిన పదార్థాలు: బాదం- 30 గ్రాములు, పిస్తా- 20 గ్రాములు, డేట్స్- 50 గ్రాములు, బెల్లం పొడి- 50 గ్రాములు, గోధుమ పిండి- 30 గ్రాములు, శెనగ పిండి- 30 గ్రాములు, ఎండు కొబ్బరి పొడి- 30 గ్రాములు, ఇంగువ- చిటికెడు, లవంగాల పొడి- పావు స్పూను, నల్ల ద్రాక్ష- 20 గ్రాములు, నట్‌మెగ్ పొడి- స్పూను, నెయ్యి- 50 గ్రాములు, ఓట్స్- 20 గ్రాములు.
తయారు చేసే విధానం: ముందుగా డ్రైఫ్రూట్స్ అన్నిటినీ వేయించుకుని మిక్సీలో పొడిలా చేయాలి. ఆ తరవాత గోధుమ, శెనగ పిండిని కూడా వేయించాలి. ఈ రెండిటినీ నెయ్యి, లవంగాల పొడి, నట్‌మెగ్ పొడి, ఇంగువ వేసి కలిపి లడ్డూల్లా కట్టాలి. ఒక్కో లడ్డూను ఎండు కొబ్బరిలో అద్ది తీస్తే డ్రైఫ్రూట్ లడ్డూ రెడీ.