లెమన్‌గ్రా్‌స జాస్మైన్ ఐస్డ్ టీ
ABN , First Publish Date - 2022-04-09T17:01:32+05:30 IST
నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్, నిమ్మకాయ ముక్కలు - రెండు(గార్నిష్ కోసం), జాస్మైన్ గ్రీన్ టీ బ్యాగ్ - ఒకటి, తేనె - ఒక టేబుల్‌స్పూన్, లెమన్‌గ్రా్‌స - ఐదు కాడలు,
కావలసినవి: నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్, నిమ్మకాయ ముక్కలు - రెండు(గార్నిష్ కోసం), జాస్మైన్ గ్రీన్ టీ బ్యాగ్ - ఒకటి, తేనె - ఒక టేబుల్‌స్పూన్, లెమన్‌గ్రా్‌స - ఐదు కాడలు
తయారీ విధానం: ఒక జార్‌లో రెండు కప్పులు వేడి నీళ్లు తీసుకుని అందులో జాస్మైన్ గ్రీన్ టీ బ్యాగులు వేయాలి. మూడు నిమిషాల తరువాత లెమన్‌గ్రా్‌స వేయాలి. ఒక స్పూన్ సహాయంతో గ్రీన్ టీ బ్యాగుల పైన, లెమన్‌గ్రా్‌సపైన ఒత్తాలి. తరువాత తేనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకుని, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని చల్లచల్లని డ్రింక్ సర్వ్ చేసుకోవాలి.