పంజాబీ లస్సీ
ABN , First Publish Date - 2022-04-20T17:57:12+05:30 IST
పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - చిటికెడు, ఐస్‌క్యూబ్స్ - కొన్ని.
కావలసినవి: పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - చిటికెడు, ఐస్‌క్యూబ్స్ - కొన్ని.
తయారీ విధానం: ముందుగా పెరుగు, సరిపడా చల్లటి నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి.తరువాత పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. మరోసారి బ్లెండ్ చేసుకోవాలి.గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేయాలి.