ప్రొటీన్‌ లడ్డూ

ABN , First Publish Date - 2022-01-12T19:07:11+05:30 IST

వేరు శెనగలు- అర కప్పు, నువ్వులు- అర కప్పు, బాదం పప్పు- రెండు స్పూన్లు, పిస్తా- రెండు స్పూన్లు, పొద్దు తిరుగుడు గింజలు

ప్రొటీన్‌  లడ్డూ

కావలసిన పదార్థాలు: వేరు శెనగలు- అర కప్పు, నువ్వులు- అర కప్పు, బాదం పప్పు- రెండు స్పూన్లు, పిస్తా- రెండు స్పూన్లు, పొద్దు తిరుగుడు గింజలు- రెండు స్పూన్లు, గుమ్మడి గింజలు- రెండు స్పూన్లు, ఎండు కొబ్బరి- అర కప్పు, అంజీర్‌, ఖర్జూర ముక్కలు- నాలుగు, యాలకుల పొడి- పావు స్పూను, బెల్లం- కప్పున్నర, నీళ్లు- పావు కప్పు.


తయారుచేసే విధానం: వేరు శనగ పప్పులు, నువ్వులు, బాదం, పిస్తా, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజల్ని వేరు వేరుగా వేయించి పొడి చేసుకోవాలి. ఎండుకొబ్బరిని కూడా వేయించి ఈ మిశ్రమానికి జతచేయాలి. అంజీర్‌, ఖర్జూర ముక్కలూ వేసి బాగా కలపాలి. ఓ పెద్ద  పాన్‌లో బెల్లం, నీళ్లు కలిపి ఉడికించాలి. తీగ పాకం కాగానే మిశ్రమాన్ని అందులో కలపాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్‌ కట్టేసి ఓ పళ్లెంలో మిశ్రమాన్ని వేసుకుని చల్లారాక ముద్దలు కడితే ప్రొటీన్‌ లడ్డూ రెడీ.

Updated Date - 2022-01-12T19:07:11+05:30 IST