సత్తు షర్బత్
ABN , First Publish Date - 2022-04-16T17:15:28+05:30 IST
నగపిండి - పావు కప్పు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.
కావలసినవి: శనగపిండి - పావు కప్పు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ: ముందుగా జీలకర్రను వేయించుకోవాలి. మామిడికాయ సన్నగా తురుముకోవాలి. తరువాత వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి శనగపిండి, తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్ వేసి చల్లచల్లని సత్తు షర్బత్ సర్వ్ చేసుకోవాలి.