తాహిని డేట్ షేక్
ABN , First Publish Date - 2022-05-20T17:57:41+05:30 IST
గడ్డకట్టిన అరటిపండ్లు- రెండు, తాజా ఖర్జూరాలు- నాలుగు, తాహిని పేస్ట్- పావు కప్పు, ఐస్ ముక్కలు
కావలసిన పదార్థాలు: గడ్డకట్టిన అరటిపండ్లు- రెండు, తాజా ఖర్జూరాలు- నాలుగు, తాహిని పేస్ట్- పావు కప్పు, ఐస్ ముక్కలు- పావు కప్పు, ఆల్మండ్ పాలు- ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి- పాపు స్పూను.
తయారుచేసే విధానం: తాజా అరటిపళ్లను ముక్కలుగా కట్ చేసి మందపాటి కవరులో వేసి రెండు గంటలపాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆ తరవాత బ్లెండర్‌లో అరటి ముక్కలు, ఖర్జూరం ముక్కలు, పాలు, ఐస్ ముక్కలు, తాహిని పేస్టు వేసి తిప్పాలి. ఈ డేట్ షేక్‌ను పొడవాటి గ్లాసుల్లో పోసి పైన యాలకుల పొడి చల్లితే సరి.