తిల్ గజక్
ABN , First Publish Date - 2022-02-23T18:09:13+05:30 IST
ముందుగా నువ్వుల్ని వేయించుకుని పొడిలా చేసుకోవాలి. పాన్‌లో నీళ్లు పోసి, బెల్లం, నువ్వుల పొడి వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి.
కావలసిన పదార్థాలు: నువ్వులు- కప్పు, బెల్లం- అర కప్పు, బటర్- రెండు స్పూన్లు, యాలకుల పొడి- అర స్పూను, నూనె- స్పూను, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా నువ్వుల్ని వేయించుకుని పొడిలా చేసుకోవాలి. పాన్‌లో నీళ్లు పోసి, బెల్లం, నువ్వుల పొడి వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి. ప్లేట్‌పై నూనె వేసి ఉడికించిన నువ్వుల మిశ్రమాన్ని సమానంగా వేయాలి. కాస్త చల్లబడ్డాక ముక్కలుగా కట్ చేస్తే గుజరాతీ వంటకం తిల్ గజక్ సిద్ధం.