మెంతికాయ
ABN , First Publish Date - 2022-05-28T20:13:02+05:30 IST
వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి ఉంటే చాలు... నాలుగు ముద్దలు ఇష్టంగా తినేస్తాం. ఇది మామిడికాయ పచ్చళ్లు పెట్టుకునే సమయం. మామిడికాయతో చేసే రకరకాల పచ్చళ్ల
నోరూరించే పచ్చళ్లు!
వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి ఉంటే చాలు... నాలుగు ముద్దలు ఇష్టంగా తినేస్తాం. ఇది మామిడికాయ పచ్చళ్లు పెట్టుకునే సమయం. మామిడికాయతో చేసే రకరకాల పచ్చళ్ల తయారీ విశేషాలు ఈ వారం మీకోసం....
కావలసినవి: మామిడికాయ ముక్కలు - మూడు గ్లాసులు, ఉప్పు - ఒక గ్లాసు, కారం - ఒక గ్లాసు, ఆవాలు - ఒకటిన్నర గ్లాసు (వేయించి పొడి చేసుకోవాలి), మెంతులు - ఒక గ్లాసు (వేయించి పొడి చేసుకోవాలి), నువ్వుల నూనె - ఒక గ్లాసు, ఇంగువ - అర టీస్పూన్.
తయారీ విధానం: ముందుగా ఉప్పు, కారం, మెంతిపొడి, ఆవపొడి బాగా కలుపుకోవాలి. తరువాత పావుగ్లాసు నూనె వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుంటూ కలుపుకొని మూత పెట్టుకోవాలి.రెండు రోజుల తరువాత స్టవ్‌పై బాణలి పెట్టి ముప్పావు గ్లాసు నూనె పెట్టి కొద్దిగా వేడి అయ్యాక ఇంగువ వేయాలి. ఈ బాణలిని స్టవ్ పై నుంచి దింపుకొని నూనె చల్లారిన తరువాత మామిడికాయ ముక్కల్లో పోసి కలుపుకొంటే పచ్చడి రెడీ.