చీజ్ దోశ
ABN , First Publish Date - 2022-02-19T18:41:34+05:30 IST
దోశ పిండి - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, మిరియాల పొడి - పావు టీస్పూన్, చీజ్ - అర కప్పు, తులసి ఆకులు - కొన్ని, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.
కావలసినవి: దోశ పిండి - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, మిరియాల పొడి - పావు టీస్పూన్, చీజ్ - అర కప్పు, తులసి ఆకులు - కొన్ని, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిని తీసుకోవాలి. ఉల్లిపాయను తరగాలి. టొమాటోను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చీజ్‌ను తురిమి పెట్టుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి వేడి అయ్యాక కొద్దిగా నూనె వేసి దోశ పోసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తరువాత ఉల్లిపాయలు వేయాలి. టొమాటో ముక్కలు వేయాలి. చీజ్ వేసుకోవాలి. తులసి ఆకులు. మిరియాల పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు చల్లుకోవాలి. చిన్నమంటపై చీజ్ కరిగే వరకు కాల్చుకోవాలి. దోశ బాగా కాలిన తరువాత తీసి సర్వ్ చేసుకోవాలి.