చీజ్ నాన్
ABN , First Publish Date - 2022-02-19T18:44:51+05:30 IST
గోధుమపిండి - రెండు కప్పులు, మైదా - ఒక కప్పు, బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీస్పూన్, బేకింగ్ సోడా - పావు టీస్పూన్, పంచదార - రెండు
కావలసినవి: గోధుమపిండి - రెండు కప్పులు, మైదా - ఒక కప్పు, బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీస్పూన్, బేకింగ్ సోడా - పావు టీస్పూన్, పంచదార - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, మజ్జిగ - మూడు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, చీజ్ - ఒక కప్పు, నల్ల నువ్వులు - రెండు టీస్పూన్లు, గోధుమపిండి - కొద్దిగా (పొడి పిండి అద్దడం కోసం)
తయారీ విధానం: ఒక బౌల్‌లో గోధుమ పిండి తీసుకుని అందులో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత మజ్జిగ, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. కొంచెం నూనె వేసి మరోసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమంపై మూత పెట్టి రెండు గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీ మధ్యలో తురిమిన చీజ్ పెట్టి చివర్లు దగ్గరకు ఒత్తాలి. పొడి పిండి అద్దుకుంటూ మళ్లీ చపాతీలా ఒత్తుకోవాలి. పైన కొద్దిగా తడి అద్ది నువ్వులు చల్లాలి. చివరగా పెనంపై కాల్చుకుని వేడి వేడిగా ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోవాలి.