చీజ్‌ పరోటా

ABN , First Publish Date - 2022-02-19T18:53:48+05:30 IST

గోధుమపిండి - 120 గ్రాములు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, చీజ్‌ - అరకప్పు. తరిగిన ఉల్లిపాయలు - పావుకప్పు, పచ్చిమిర్చి - రెండు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, గోధుమపిండి - కొద్దిగా ( పొడి పిండి అద్దడం కోసం)

చీజ్‌ పరోటా

కావలసినవి: గోధుమపిండి - 120 గ్రాములు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, చీజ్‌ - అరకప్పు. తరిగిన ఉల్లిపాయలు - పావుకప్పు, పచ్చిమిర్చి - రెండు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, గోధుమపిండి - కొద్దిగా ( పొడి పిండి అద్దడం కోసం)


తయారీ విధానం: ఒక మిక్సింగ్‌ బౌల్‌లో గోధుమపిండి తీసుకుని అందులో కొద్దిగా నూనె, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో తురిమిన చీజ్‌, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిలో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని రెండు చపాతీల్లా ఒత్తుకోవాలి.  ఒక చపాతీపై చీజ్‌ మిశ్రమం పెట్టాలి. తరువాత దానిపై మరో చపాతీపెట్టి చివర్లు వేళ్లతో ఒత్తాలి. పొడి పిండి అద్దుకుంటూ చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి.  స్టవ్‌పై పెనం పెట్టి ఈ పరోటాను కాల్చుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. సాయంత్రం స్నాక్స్‌గా ఈ పరోటాలు సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2022-02-19T18:53:48+05:30 IST