చిల్లీ చీజ్‌ టోస్ట్‌

ABN , First Publish Date - 2022-02-19T18:32:34+05:30 IST

బ్రెడ్‌ ప్యాకెట్‌ - చిన్నది, చీజ్‌ - అరకప్పు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం(దంచినది) - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - ఒక టీస్పూన్‌.

చిల్లీ చీజ్‌ టోస్ట్‌

కావలసినవి: బ్రెడ్‌ ప్యాకెట్‌ - చిన్నది, చీజ్‌ - అరకప్పు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం(దంచినది) - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ఒక బౌల్‌లోకి సన్నగా కట్‌చేసిన చీజ్‌ తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను త్రిభుజాకారంలో లేదా చతురస్రాకారంలో కట్‌ చేసుకోవాలి.  ఆ బ్రెడ్‌ ముక్కలను బేకింగ్‌ ట్రేలో పెట్టి 200 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీ హీట్‌ చేసిన ఓవెన్‌లో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి.  తరువాత ప్లేట్‌లోకి తీసుకుని బ్రెడ్‌ ముక్కలపై కొద్దిగా వెన్న రాసి, చీజ్‌ మిశ్రమాన్ని పరుచుకోవాలి.  ఇప్పుడు మళ్లీ పది నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి.  వీటిని టొమాటో సాస్‌తో సర్వ్‌ చేసుకుంటే టేస్ట్‌ బాగుంటుంది.

Updated Date - 2022-02-19T18:32:34+05:30 IST